60 ఏళ్ల వ్యక్తికి సర్జరీ చేస్తుంటే గుండె నుంచి మంటలు…

60 ఏళ్ల వ్యక్తికి సర్జరీ చేస్తుంటే గుండె నుంచి మంటలు…

ఓ రోగికి హార్ట్ ఆపరేషన్ చేస్తుండగా గుండె నుంచి మంటలు వచ్చాయి. దీంతో డాక్టర్లు షాక్ అయ్యారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ హాస్పిటల్ లో జరిగింది. ఓ 60ఏళ్ల వ్యక్తి ఊపిరితిత్తుల సమస్యతో హాస్పిటల్ లో చేరాడు. అతని కుడివైపు లంగ్స్ ఉబ్బడంతో పక్కటెముకల్లో నొప్పి వచ్చింది. దీంతో ఆపరేషన్ చేయడానికి నిర్ణయించారు డాక్టర్లు.

ఆపరేషన్ లో భాగంగా.. ఊపిరితిత్తుల్లో ఒక దానికి రంద్రం చేశారు డాక్టర్లు. అయితే రోగి తీసుకుంటున్న గాలి డాక్టర్లు చేసిన రంధ్రం నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో గుండె వద్ద అనెస్తేటిక్ లీకైంది. దీన్ని గుర్తించని డాక్టర్లు సర్జరీని చేస్తున్నారు. అప్పుడే డాక్టర్లు ఆపరేషన్ కు ఉపయోగించిన పరికరం నుంచి మంట వచ్చింది. దీనికి రోగి పీల్చిన ఆక్సిజన్ కు  అనెస్తెటిక్ తోడై మండింది. దీంతో రోగి శరీరంలోకి మంట ప్రవేశించింది. దీంతో అప్రమత్తమైన డాక్టర్లు మంటను అదుపుచేశారు. రోగికి ఎటువంటి హాని జరుగలేదని తెలిపారు డాక్టర్లు.