తగలబడిన కార్లు..వ్యక్తి సజీవ దహనం

తగలబడిన కార్లు..వ్యక్తి సజీవ దహనం

హైదరాబాద్ అబిడ్స్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బొగ్గుల కుంటలోని కామినేని ఆస్పత్రిని పక్కనే ఉన్న కారు గ్యారేజీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మంటల్లో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. అగ్ని ప్రమాద సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది...మంటలను అదుపులోకి తెచ్చారు. కానీ అప్పటికే ఐదు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. 

కాలిపోయిన కార్లలోని ఓ కారులో ఓ వ్యక్తి సజీవ దహనం అయినట్లు తెలిసింది. ఆ వ్యక్తిని అక్కడే పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు సంతోష్‌గా గుర్తించారు. కారులో మంటలు చెలరేగడం వల్లనే ప్రమాదం జరిగినట్లు అబిడ్స్ సీఐ  ప్రసాద్ తెలిపారు. సెక్యూరిటీ గార్డు నిద్రిస్తున్న కారులో మంటలు చెలరేగినట్లు చెప్పారు.