ఫిర్జాదిగూడ హోటల్లో అగ్ని ప్రమాదం

ఫిర్జాదిగూడ హోటల్లో అగ్ని ప్రమాదం

మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ హోటల్ లోని సెకండ్ ఫ్లోర్ కిచెన్ లో మంటలు చెలరేగాయి. దీంతో భారీగా పొగ కమ్ముకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన హోటల్ యాజమాన్యం.. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది.