ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. రూ. 10 లక్షల ఆస్తి నష్టం

ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. రూ. 10 లక్షల ఆస్తి నష్టం

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని పరిగి రోడ్డు దగర్లోని ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. వ్యర్థాల రి సైకిల్ చేసే పరిశ్రమలో నిల్వ ఉంచిన ప్లాస్టిక్ పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యిందని పరిశ్రమ నిర్వహకులు తెలిపారు. సంఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకునే లోపే మంటలు పూర్తిగా వ్యాపించి ప్లాస్టిక్ కాలి బూడిదయింది.

సుమారు రూ. 10 లక్షల వరకు నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నేమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.