ఆస్తుల రక్షణలో ఫైర్ సర్వీసులు కీలకం: ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి

ఆస్తుల రక్షణలో ఫైర్ సర్వీసులు కీలకం: ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి

జడ్చర్ల టౌన్, వెలుగు: ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణలో ఫైర్ సర్వీసులు కీలకమని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. శనివారం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నేషనల్ దాబా సమీపంలో నూతనంగా నిర్మించనున్న ఫైర్ స్టేషన్ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ  పెరుగుతున్న పట్టణ అవసరాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో సత్వర స్పందనకు ఇది ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. అనంతరం తొలి ఏకాదశి సందర్భంగా పట్టణంలోని శ్రీ రంగానాయక గుట్టపై రంగనాయక స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.