అమెరికా మరోసారి నెత్తురోడింది. కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ డియాగో నగరంలోని ఓ యూదు ప్రార్థనాలయంలోకి చొరబడ్డ దుండగులు.. తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించాడు. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా… ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల తర్వాత నిందితుడు ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు.
శాన్ డియాగో నగరంలోని పోవేలో ఉన్న యూదు ప్రార్థనాలయంలో శనివారం ఉదయం 11.30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పులు జరిపిన జాన్ ఎర్నెస్ట్(19) యువకుడిని అదుపులోకి తీసుకున్నామని తులిపారు. ఇతను దాడి కోసం ఏఆర్ కేటగిరీకి చెందిన సెమీ ఆటోమేటిక్ రైఫిల్ వాడాడని చెప్పారు. జాతి విద్వేషం కారణంగానే దుండుగుడు కాల్పులు జరిపినట్టు భావిస్తున్నారు.
ఈ ఘటనపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ …వైట్ హౌస్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇది జాతి విద్వేష దాడిగా అభివర్ణించారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నిందితుడిని పోలీసులు వెంటనే పట్టుకున్నారనీ, ఇందుకు ధన్యవాదాలు తెలుపుతూ ట్విట్లర్ లో ట్వీట్ చేశారు ట్రంప్.
Thoughts and prayers to all of those affected by the shooting at the Synagogue in Poway, California. God bless you all. Suspect apprehended. Law enforcement did outstanding job. Thank you!
— Donald J. Trump (@realDonaldTrump) April 27, 2019
