హనుమకొండ జిల్లాలో విషాదం..స్విమ్మింగ్ పూల్ లో తల్లీకూతుళ్ళ అనుమానాస్పద మృతి 

హనుమకొండ జిల్లాలో విషాదం..స్విమ్మింగ్ పూల్ లో తల్లీకూతుళ్ళ అనుమానాస్పద మృతి 

హనుమకొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్లో పడి తల్లి, ఇద్దరు కూతుళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గురువారం ( ఏప్రిల్ 2 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెల్ గ్రామానికి చెందిన ఫర్హత్, ఆమె కూతుళ్లు ఉమేరా, అయేషాలు స్విమ్మింగ్ పూల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

పున్నెల్ క్రాస్ దగ్గర ఉన్న ఓ వెంచర్ లో తండ్రి అజారుద్దీన్ వాళ్ళను అక్కడ వదిలిపెట్టి వెళ్లినట్లు తెలుస్తోంది. అజారుద్దీన్ తిరిగి వచ్చేసరికి తల్లీకూతుళ్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. కూతురు పుట్టినరోజు కావడంతో భార్య, పిల్లలను వెంచర్ దగ్గరికి తీసుకెళ్లానని చెబుతున్నాడు అజారుద్దీన్.

భర్త అజారుద్దీన్ పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు భార్య బంధువులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ఐనవోలు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లీకూతుళ్లు ప్రమాదవశాత్తు పూల్ లో పడి మృతి చెందారా..? లేక ఇది ప్లాన్డ్ మర్డరా అన్న కోణం లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.