ఆర్టీసీ ఏసీ బస్సులో మంటలు

V6 Velugu Posted on Nov 14, 2021

ఖమ్మం జిల్లా వైరాలో ఆర్టీసీ ఏసీ బస్సులో మంటలు చెలరేగాయి. హైదరాబాద్ మియాపూర్ డిపోకు చెందిన గరుడ బస్సు భద్రాచలం వైపు వెళ్తుండగా మంటలు చెలరేగాయి. వెంటనే గుర్తించి అప్రమత్తమైన బస్సు  డ్రైవర్ బస్సు ఆపి ప్రయాణికులను కిందకు దించేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. మంటలు చెలరేగిన సమయంలో బస్సులో దాదాపు 50మంది వరకు ప్రయాణీకులు ప్రయాణిన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు.
 

Tagged Telangana, tsrtc, fire accident, Khammam district, vira, ac bus

Latest Videos

Subscribe Now

More News