జడ్జిలపై అసభ్య కామెంట్స్ కేసులో తొలి అరెస్ట్

జడ్జిలపై అసభ్య కామెంట్స్ కేసులో తొలి అరెస్ట్

న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో ఏపీ పోలీసులు రంగంలోకి దిగారు. జడ్జిలపై అసభ్య కామెంట్ల నేపథ్యంలో  తొలి అరెస్ట్ జరిగింది.  విజయవాడ ఏసీబీ కోర్టు మహిళ మేజిస్ట్రేట్పై  భీమిలికి చెందిన నూకరాజు అనే వ్యక్తి సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు.

చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో ఫేస్బుక్లో అసభ్యకరమైన పోస్టులు, కొన్ని పోస్టుల కింద కామెంట్లు పెట్టాడు నూకరాజు. దీనిపై సుమోటోగా కేసు నమోదు చేసింది సైబర్ క్రైమ్.

నూకరాజుపై ఐపీసీ సెక్షన్ నెంబర్ 354, 505,509 ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడిని విశాఖ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.  నూకరాజుకు 14 రోజల రిమాండ్ విధించింది కోర్టు.