పెళ్లికి వెళ్లి వచ్చిన వ్యక్తికి కరోనా.. టెన్షన్ లో పెళ్లి బృందం

పెళ్లికి వెళ్లి వచ్చిన వ్యక్తికి కరోనా.. టెన్షన్ లో పెళ్లి బృందం

కోదాడలో ఫస్ట్ కరోనా కేసు

పెళ్లికి వెళ్లి వచ్చిన వ్యక్తికి కరోనా సోకిన ఘటన సూర్యపేట జిల్లాలో జరిగింది. ఆ వ్యక్తికి కరోనా పెళ్లిలో సోకిందో లేక పెళ్లికి వచ్చి వెళ్ళిన తర్వాతో సోకిందో తెలియక పెళ్లికి హాజరయిన వారందరూ ఆందోళన పడుతున్నారు.  సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. పట్టణానికి చెందిన గునగుంట్ల రాజేష్ హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. ఈ నెల 11న రాజేష్ ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో తెలిసిన వారి పెళ్లికి హాజరై రెండు రోజులు అక్కడే ఉన్నాడు. పెళ్లికి వెళ్లి వచ్చినప్పటి నుండి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో విజయవాడ లో చికిత్స తీసుకున్నాడు. రాజేష్ లో కరోనా లక్షణాలు ఉండటంతో వైద్యులు పరీక్షల నిమిత్తం శాంపిల్స్ ను గాంధీ ఆస్పత్రికి పంపించారు. ఈ రోజు ఉదయం వచ్చిన ఫలితాల్లో రాజేష్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. దాంతో వెంటనే రాజేష్ ను కోదాడ నుంచి సూర్యాపేటకు తరలిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. అయితే రాజేష్ పెళ్లికి వెళ్లివచ్చిన తర్వాత ఎవరెవరిని కలిశాడనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

For More News..

అప్పట్లో నర్సాపూర్ నుంచి నేనే కారు నడుపుకుంటూ వెళ్లేవాన్ని

హైదరాబాద్ లో ఏరియా వైజ్ కరోనా కేసులు ఇవే..

కొడుకును చంపి.. తల్లికి ఫోన్ చేసి చెప్పిన హంతకులు