కరోనా వైరస్.. పెంపుడు కుక్కకు కూడా సోకింది

కరోనా వైరస్.. పెంపుడు కుక్కకు కూడా సోకింది

హాంగ్ కాంగ్:  ఇప్పటివరకూ మనుషులకే సోకుతున్న కరోనా వైరస్ ఇప్పుడు ఓ జంతువుకు కూడా సోకింది. హంగ్ కాంగ్ లోని ఓ కరోనా వైరస్ పేషెంట్ యొక్క పెంపుడు కుక్కకు కూడా వైరస్ సోకినట్లు తెలిసింది. 60 ఏళ్ల మహిళా రోగికి చెందిన ఆ కుక్క..  వైరస్ లక్షణాల కారణంగా గత వారం రోజుల నుండి ఒక జంతు సంరక్షణ కేంద్రంలో నిర్బంధించబడి ఉంది.

వైద్యులు ఆ కుక్కకు  పరీక్షలు చేయగా వైరస్ పాజిటీవ్ గా ఉన్నట్లు తేలింది. ఈ వ్యాధి మనుషుల నుండి జంతువులకు సంక్రమించే అవకాశం ఉందని రెండ్రోజుల క్రితం డాక్టర్లు తెలిపారు. వైరస్ లక్షణాలు కనిపించిన ఈ పెంపుడు కుక్కతో పాటు మరో కుక్కను కూడా జంతు కేంద్రంలో డాక్టర్ల సంరక్షణలో ఉంచామని, అందులో వైరస్ రోగి యొక్క కుక్కకు మాత్రమే వైరస్ పాజిటివ్ గా వచ్చిందని చెప్పారు. మరో 14 రోజులు పాటు తమ కేంద్రంలోనే ఉంచి చికిత్స చేస్తామని, వ్యాధి నెగిటివ్ అని తేలితే అప్పుడు బయటకు పంపుతామని చెప్పారు.