
ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా లీడ్ రోల్స్‌లో విజయేందర్ ఎస్ రూపొందిస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’. బన్నీ వాస్ సమర్పణలో కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని రెండు పాటలను రిలీజ్ చేసి సినిమాపై బజ్ క్రియేట్ చేశారు మేకర్స్.
సోమవారం ప్రియదర్శి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్‌తో పాటు తన క్యారెక్టర్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఇందులో దర్శి లుక్ ఆకట్టుకుంది. డప్పు కొడుతూ కనిపిస్తున్న తన పోస్టర్ ఇంప్రెస్ చేస్తోంది. ఇందులో చైతన్య పాత్రలో దర్శి కనిపించనున్నట్టు రివీల్ చేశారు. సోషల్ మీడియాలో మంచి ఫేమ్ తెచ్చుకున్న నిహారిక ఎన్.ఎం ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందిస్తున్నాడు.