తెలంగాణలో తొలి ముస్లిం ఐపీఎస్ అధికారిణిగా అయేషా ఫాతిమా

తెలంగాణలో తొలి ముస్లిం ఐపీఎస్ అధికారిణిగా అయేషా ఫాతిమా

తెలంగాణకు ఆరుగురు, ఏపీకి ముగ్గురు ఐపీఎస్ అధికారులను కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2022 బ్యాచ్ కు చెందిన  200 మంది ఐపీఎస్ లను  వివిధ ప్రాంతాలకు కేటాయిస్తూ కేంద్రమంతృత్వ శాఖ  ఉత్తర్వులు జారీ చేసింది.  తెలంగాణకు కేటాయించిన కొత్త ఐపీఎస్ అధికారుల్లో  మధ్యప్రదేశ్ కు చెందిన  అయేషా ఫాతిమా కూడా ఉన్నారు. 

2022 UPSC పరీక్షలో 184వ ర్యాంక్ సాధించిన చెందిన అయేషా ఫాతిమా మాల్వా ప్రాంతంలోని దేవాస్‌లోని వింధ్యాచల్ పాఠశాలలో తన విద్యను అభ్యసించింది. మోడల్ పబ్లిక్ స్కూల్‌లో 12వ తరగతి పూర్తి చేసింది. ఆమె తండ్రి, నజీరుద్దీన్ షేక్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఆమె తల్లి పాఠశాల డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 

కుటుంబంలో రెండవ కుమార్తె అయిన ఆయేషా, 2015లో ఇండోర్‌లోని SGSITS కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత JEE పోటీ పరీక్షలలో ప్రతిభ కనబరిచింది. ఇంజనీరింగ్ వైపు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ ఆయేషా సమాజానికి తనవంతు చేయాలనే కోరికతో 2019లో UPSC పరీక్షలకు సిద్దమైంది. ప్రారంభంలో ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ చివరికి ఆమె UPSC పరీక్షలో 184వ ర్యాంక్ సాధించింది.  ఆయేషా ఫాతిమా తెలంగాణ ఐపీఎస్ కేడర్‌కు చెందిన  తొలి ముస్లిం మహిళా పోలీసు అధికారి కావడం విశేషం. 

ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెలంగాణకు 76 మంది ఐపీఎస్ అధికారులను మాత్రమే కేటాయించారని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీకి వెళ్లినప్పుడు అమిత్ షా చెప్పారు.   కొత్త జిల్లాల ఏర్పాటు, వివిధ శాఖల పర్యవేక్షణ కోసం రాష్ట్రానికి అదనంగా 29 ఐపీఎస్‌ పోస్టులను మంజూరు చేయాలని హోంమంత్రిని సీఎం కోరారు. ఈ క్రమంలో తెలంగాణకు కొత్తగా ఆరుగురు కొత్త  ఐపీఎస్ అధికారులను కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.