ప్రశాంతంగా ముగిసిన గుజరాత్ ఫస్ట్ ఫేజ్ పోలింగ్

ప్రశాంతంగా ముగిసిన గుజరాత్ ఫస్ట్ ఫేజ్ పోలింగ్
  • ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు
  • కొన్నిచోట్ల మొరాయించిన ఈవీఎంలు
  • వెంటనే రీప్లేస్ చేసిన ఎన్నికల కమిషన్

 

అహ్మదాబాద్ : గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఫస్ట్​ ఫేజ్​లో 89 స్థానాలకు గురువారం జరిగిన పోలింగ్​ ప్రశాతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల దాకా 59.20 శాతం ఓటింగ్​ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటలకు పోలింగ్​ ప్రారంభమైంది. మొత్తం 19 జిల్లాల్లోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయని, కొన్ని సెంటర్స్​లో ఈవీఎంలు మొరాయించడంతో వెంటనే రీప్లేస్​ చేసినట్టు ప్రకటించారు. ట్రైబల్స్​ ఎక్కువగా ఉన్న తాపి, నర్మదా జిల్లాల్లో 65 శాతానికి పైగా ఓటింగ్​ రికార్డయ్యిందని తెలిపారు. భావ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పాలిటానాలో రెండు రాజకీయ పార్టీల లీడర్ల మధ్య స్వల్ప ఘర్షణ మినహా పోలింగ్​ పీస్​ఫుల్​గా కంప్లీట్​ అయినట్టు ఎన్నికల కమిషన్​ ప్రకటించింది. తమకు ప్రత్యేక బూత్​లేదని జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ జిల్లాలోని జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జోధ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలింగ్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మహిళలు నిరసన తెలిపారు. జునాగఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్ కార్యకర్త తన భుజంపై సిలిండర్​పెట్టుకుని పోలింగ్​ స్టేషన్​ వైపు వెళ్తుండగా.. పోలీసులు అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా గొడవ జరిగింది. కాంగ్రెస్ లీడర్​ పరేశ్​ ధనాని సైకిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గ్యాస్ సిలిండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలింగ్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పెళ్లారు. బీజేపీలో పాలనలో ధరలు పెరిగాయంటూ నిరసన తెలిపారు. 33 బ్యాలెట్​ యూనిట్స్, 29 కంట్రోల్​ యూనిట్స్, 69 వీవీ ప్యాట్​లను ఈసీ రీప్లేస్​ చేసింది.

జామ్​నగర్​లో ఓటేసిన జడేజా కపుల్​ 

ఉమర్​గాంలోని పోలింగ్​ స్టేషన్​కు వెళ్లి 100 ఏండ్ల కాముబెన్ లాలాభాయ్​ పటేల్ ఓటేసింది. 104 ఏండ్ల రామ్​జీ భాయ్ పోస్టల్​బ్యాలెట్ ఎంచుకోకుండా పోలింగ్​ స్టేషన్​కెళ్లి ఓటేసినట్టు ఈసీ తెలిపింది. ఇండియన్​ క్రికెటర్ రవీంద్ర జడేజా, ఆయన సతీమణి రివబ జడేజా జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఓ పోలింగ్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లి ఓటేశారు. రవీంద్ర జడేజా భార్య జామ్​నగర్​ నార్త్​ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తుంటే.. ఆయన తండ్రి అనిరుధ్ సిన్హ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జడేజా మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. కుమార్తె  నైనా జడేజాతో కలిసి జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఓ పోలింగ్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓటేశారు. బీజేపీ సీనియర్​ లీడర్, మాజీ సీఎం విజయ్​ రూపానీ, స్టేట్​ బీజేపీ చీఫ్​ సీఆర్​ పాటిల్, రాజ్యసభ సభ్యుడు పరిమల్​ నథ్వానీ, మాజీ కాంగ్రెస్​ అపోజిషన్​ లీడర్​ పరేశ్​ ధనానీ, ఆప్​ స్టేట్ చీఫ్​ గోపాల్​ ఇటాలియాలు ఫస్ట్​ ఫేజ్​లో భాగంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పెండ్లి బట్టల్లోనే ఓటేశారు..

కవిత, వైభవ్​లు పెండ్లి చేసుకుని మండపం నుంచి డైరెక్ట్​గా పోలింగ్ బూత్​కు వెళ్లి ఓటేశారు. కచ్ జిల్లా భుజ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 208 పోలింగ్ సెంటర్​లో ఈ న్యూ కపుల్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.