
స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్ (Pushpa2TheRule). ఈ సినిమా టీజర్ కోసం ఆయన ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూసారు. ఇక వారి ఎదురుచూపులకు ఎండ్ కార్డు వేస్తూ రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ తో ఫ్యాన్స్ లో అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి.దీంతో ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ కూడా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
తాజాగా పుష్ప ది రూల్ ప్రొడక్షన్ హౌస్ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. "ప్రపంచం పుష్ప రాజ్‌ను మేనియాను చూడాలనుకుంటోంది..పుష్ప 2 నుంచి పుష్ప పుష్ప అనే లిరికల్ ప్రోమో రేపు సాయంత్రం (ఏప్రిల్ 24న) 4:05 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు" మేకర్స్ ప్రకటించారు. దీంతో రేపు పుష్ప రాజ్ ఫ్యాన్స్ లో పూనకాలు షురూ కాబోతున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో రానున్న ఈ సాంగ్స్ మరోసారి బ్లాక్ బాస్టర్ అవ్వడం కన్ఫమ్.
Also Read:నిర్మాతల నుంచి పవన్‌కల్యాణ్ తీసుకున్న అప్పు..మైత్రి మేకర్స్ దగ్గర ఎంతంటే?
పుష్ప పార్ట్ 1 కి ఇచ్చిన ఒక్కో సాంగ్ చార్ట్ బ్లాస్టర్ అయింది. ఇక పార్ట్ 1 కి వచ్చిన స్పందన..ఈ సినిమాకి వచ్చిన అవార్డ్స్ దృష్ట్యా..పుష్ప 2 సినిమాపై మరింత బాధ్యత ఉంది మేకర్స్. కనుకే, ఈ సినిమాలో రిలీజ్ చేసే పోస్టర్ దగ్గర నుండి టీజర్, సాంగ్స్, ట్రైలర్ వరకు మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్.
THE WORLD WILL SING THE PRAISE OF PUSHPA RAJ ❤️?❤️?#Pushpa2TheRule First Single #PushpaPushpa Lyrical Promo out tomorrow at 4:05 PM ❤️?
— Pushpa (@PushpaMovie) April 23, 2024
Rockstar @ThisIsDSP Musical ??#Pushpa2FirstSingle ❤️?
Grand release worldwide on 15th AUG 2024 ??
Icon Star @alluarjun @iamRashmika… pic.twitter.com/F6CqyMNUZT
పుష్ప ఫస్ట్ పార్ట్ లో మొత్తం జీరో స్థాయి నుంచి స్మగ్లర్ గా మారిన అల్లు అర్జున్ కు..ఇక పుష్ప 2లో స్మగ్లర్ గా ప్రపంచాన్ని ఎలా రూల్ చేశాడో చూపించబోతున్నా అల్లు అర్జున్ కు తేడా తెలుసుకోవడానికి అందరు ఎదురుచూస్తున్నారు.ఈ మూవీ 2024 ఆగస్టు 15 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది.