Pawan Kalyan Affidavit: నిర్మాతల నుంచి పవన్‌కల్యాణ్ తీసుకున్న అప్పు..మైత్రి మేకర్స్ దగ్గర ఎంతంటే?

Pawan Kalyan Affidavit: నిర్మాతల నుంచి పవన్‌కల్యాణ్ తీసుకున్న అప్పు..మైత్రి మేకర్స్ దగ్గర ఎంతంటే?

నటుడు,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాల్లో బిజీగా ఉంటూనే..రాష్ట్ర రాజకీయాల్లో తనదైన చతురతతో అడుగులు వేస్తున్నారు. మొన్నటి వరకు బడా బ్యానర్ లో సినిమాలు చేస్తూనే..మరికొన్ని కొత్త సినిమాలు చేయడానికి సైన్ చేశాడు.

ఇక ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కొన్నాళ్ళు సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌కల్యాణ్‌ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. 

మంగళవారం (ఏప్రిల్ 23న) ఆయన ఎమ్మెల్యేగా నామినేషన్‌ ను సమర్పించారు. అయితే, ఈ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆయనకి సంబంధించిన ఆస్తులు, అప్పుల వివరాలను క్లుప్తంగా పంచుకున్నారు. 

పవన్ కళ్యాణ్ ముందుగా డిసైడ్ అయిన సినిమాలతో పాటు, వివిధ వ్యక్తిగత అవసరాల కోసం ఏకంగా రూ.46.70 కోట్ల అప్పు చేసినట్లు ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. ఆ అప్పు వివరాలను చూసుకుంటే..పవన్ అత్యధికంగా విజయ్‌ లక్ష్మి వి.ఆర్‌. నుంచి రూ.8 కోట్లు అప్పుగా చేయగా, అతి తక్కువగా OG సినిమా ప్రొడక్షన్ హౌస్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నుంచి రూ.10 లక్షలు తీసుకున్నారు. 

ఇకపోతే హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ నుంచి రూ.6కోట్ల 35 లక్షలు తీసుకోగా..చిరంజీవి సతీమణి, పవన్‌ వదిన కొణిదెల సురేఖ వద్ద రూ.2 కోట్లు అప్పు చేశారు. అలాగే టాలీవుడ్ బడా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నుంచి రూ 3 కోట్లు, ఆ బ్యానర్ అధినేతలో ఒకరైన నవీన్ ఎర్నేని నుంచి రూ.5.50 కోట్ల మేరకు పర్సనల్ లోన్ తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన అప్పుల వివరాల జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే..డైరెక్టర్ హరీష్ శంకర్ తో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ అలాగే సుజీత్‌ తో ‘ఓజీ’, క్రిష్‌ తో ‘హరి హరి వీరమల్లు’  సినిమాల్లో నటిస్తున్నారు. అలాగే మరిన్ని కొత్త సినిమాలకు కూడా లైన్ లో పెట్టేశాడు. అందులో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా ఉంది. 

  • Beta
Beta feature