Nani: నాని సినిమాలకు మారిపోతున్న ప్రొడ్యూసర్లు.. చివరి నిమిషంలో ఎందుకు చేతులు మారుతున్నాయ్?

Nani: నాని సినిమాలకు మారిపోతున్న ప్రొడ్యూసర్లు.. చివరి నిమిషంలో ఎందుకు చేతులు మారుతున్నాయ్?

ఒక “సినిమా”(CINEMA).. వెనక పెద్ద యుద్ధమే ఉంటుంది. ప్రేక్షకులు మెచ్చే కథను క్రియేట్ చేయడానికి రచయితలు, దర్శకులు ఎంతో కసరత్తు చేస్తారు. ఆ తర్వాత కథకు తగ్గ హీరోని ఎంచుకుంటారు. ఆపై అది రూపుదాల్చడానికి నిర్మాత వైపు అడుగేస్తారు. ఇక అక్కడ చెప్పిన కథ ఒకే అయితే.. షూటింగ్కి రెడీ అయిపోతారు. అయితే, ప్రీ-ప్రొడక్షన్ పూర్తయ్యాక హీరో, దర్శకుడు లేదా చివరికి నిర్మాత మారినా సినిమా ఆలస్యం కావడం ఖాయం. ఆలస్యం పెరిగే కొద్దీ ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి కూడా తగ్గిపోతుంది. 

అయితే, ఇలాంటి పరిస్థితే నాని ఫేస్ చేస్తూ వస్తున్నాడు. కథ, దర్శకుడు, టెక్నీషియన్స్ విషయంలో ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకునే నాని.. ఇప్పుడు నిర్మాతల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి వచ్చింది. కారణం, నాని ఎంచుకున్న రెండు సినిమాలకు గాను చివరి నిమిషంలో నిర్మాతలు మారడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. 

►ALSO READ | Ram Charan: 'పెద్ది' రిలీజ్ వాయిదా? క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. మెగా ఫ్యాన్స్‌కు ఇక పండగే!

శ్యామ్ సింగ రాయ్: 2021లో దర్శకుడు రాహుల్ సాంకృత్యన్–నాని కాంబినేషన్‌లో వచ్చిన శ్యామ్ సింగ రాయ్ మొదట సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రారంభమైంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా అదే సంస్థలో మొదలయ్యాయి. అయితే అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ నుంచి సితార తప్పుకోవడంతో, నిర్మాతగా వెంకట్ బోయనపల్లి ఎంట్రీ ఇచ్చారు. చివరికి నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మాణంలోనే సినిమా పూర్తైంది.

బ్లడీ రోమియో: లేటెస్ట్గా నాని–సుజీత్ కాంబోలో రూపొందుతున్న బ్లడీ రోమియో విషయంలో కూడా నిర్మాత మారినట్లు సమాచారం. నానితో సరిపోదా శనివారం, సుజీత్‌తో OG లాంటి హిట్ సినిమాలు అందించిన డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారని మొదట పూజా కార్యక్రమాలు జరిగాయి. ‘NANI 32’ వీడియో కూడా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి విడుదల కావడంతో ఫ్యాన్స్ కూడా అదే ఫిక్స్ అయ్యారు.

అయితే నాని పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో, పోస్టర్‌లలో డీవీవీ దానయ్య పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. దీంతో బ్లడీ రోమియో ప్రాజెక్ట్ నుండి డీవీవీ దానయ్య తప్పుకున్నట్లు సమాచారం. అయితే, ఈ సినిమాని కూడా శ్యామ్ సింగ రాయ్ నిర్మాత వెంకట్ బోయనపల్లినే టేకప్ చేసి నిర్మిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపైనే ఫస్ట్ లుక్ & వీడియో రిలీజయింది. ఈ విధంగా ఇటీవల కాలంలో నాని సినిమాల విషయంలో నిర్మాతలు మారడం పట్ల సినీ అభిమానుల్లో పలు ప్రశ్నలు లేవనెత్తాయి.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, నాని తన సినిమాలకు పూర్తి క్రియేటివ్ ఫ్రీడమ్ కోరుకుంటారని, బడ్జెట్, ప్లానింగ్, షూటింగ్ షెడ్యూల్స్ విషయంలో వంటి అంశాల్లో తనకు కంఫర్ట్‌గా అనిపించే నిర్మాతలతోనే పనిచేస్తారని సినీ వర్గాల్లో టాక్ ఉంది.  ఏమైనా క్రియేటివ్ డిఫెరెన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే, వెంకట్ బోయనపల్లితో ఉన్న మంచి అనుబంధం కారణంగానే బ్లడీ రోమియో ప్రాజెక్ట్‌ను మరోసారి ఆయనకే అప్పగించినట్లు చర్చ జరుగుతోంది. బ్లడీ రోమియో నిర్మాతగా దానయ్య మారడంపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.