జనగామ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్ లో పల్టీలు కొట్టి రిజర్వాయర్ లోకి దూసుకెళ్లింది స్విఫ్ట్ కారు. గురువారం ( ఫిబ్రవరి 26 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జనగామ జిల్లా చిల్పూరు మండలం దేశాయి తాండా దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. స్టేషన్ ఘన్ పూర్ నుంచి దేశాయి తండాకు వెళ్తుండగా పల్టీలు కొట్టి రిజర్వాయర్ లోకి దూసుకెళ్లింది స్విఫ్ట్ కారు.
ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలవ్వగా.. డ్రైవర్ గల్లంతైనట్లు తెలుస్తోంది. గాయాలతో బయటపడ్డ దారావత్ చరణ్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ALSO READ : కుమ్మెర ఘటనకు అసలు కారణం అదే...
డ్రైవింగ్ చేస్తున్న భూక్యా పవన్ ఆచూకీ దొరకలేదని తెలిపారు పోలీసులు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గల్లంతైన భూక్యా పవన్ కోసం గాలింపు చేపట్టారు.
