T20 World Cup: తడబడి నిలబడిన విండీస్.. సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్?

T20 World Cup: తడబడి నిలబడిన విండీస్.. సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్?

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ సూపర్–8లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. టాస్ గెలిచి ముందుగా సౌతాఫ్రికా జట్టు ఫీల్డింగ్  తీసుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కి దిగిన విండీస్ బ్యాటర్ల 29 పరుగుల వద్ద కెప్టెన్ షాయ్ హోప్ 16 పరుగులు చేసి కగిసో రబడా బౌలింగ్ లో కీపర్ క్వింటన్ డికాక్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరుకున్నాడు. వెస్టిండీస్ మరో 2 పరుగులు జోడించిన తర్వాత షిమ్రాన్ హెట్‌మైర్ (2) కూడా రబడా బౌలింగ్ లోనే కేశవ్ మహారాజ్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో 32 పరుగులకే ఓపెనింగ్ బ్యాటర్లు ఇద్దరు పెవిలియన్ బాట పట్టారు. 

అనంతరం క్రీజులోకి వచ్చిన బ్రాండన్ కింగ్ (21), రోస్టన్ చేజ్ (2) కూడా ఎక్కువ సేపు స్టేడియంలో నిలవలేకపోయారు. ప్రోటీస్ బౌలర్ లుంగి ఎన్‌గిడీ దెబ్బకి వరుస బాల్స్ లోనే వీరు ఇద్దరు మైదానం వీడారు. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన షెర్ఫేన్ రదర్‌ఫోర్డ్ (12), మ్యాథ్యూ ఫోర్డ్ (11), రోవ్‌మన్ పావెల్ (9) సైతం ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయలేకపోయారు. దీంతో 60 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడింది. అప్పుడే క్రీజులోకి వచ్చిన రొమారియో షెపర్డ్, జేసన్ హోల్డర్ సఫరీ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. 

83 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న విండీస్ జట్టును జేసన్ హోల్డర్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో హాఫ్ సెంచరీ (49)ని మిస్ చేసుకుని కార్బిన్ బోష్ బౌలింగ్ లో రన్ అవుట్ అయ్యాడు. మరోవైపు, రొమారియో షెపర్డ్ సైతం 37 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సులతో అర్థ సెంచరీ (52) చేసి వెస్టిండీస్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విండీస్ 176 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి మూడు వికెట్లు తీసుకుని విండీస్ జట్టును కొలుకోని దెబ్బ కొట్టగా కగిసో రబడా, కార్బిన్ బోష్ చెరో రెండు వికెట్లను పడగొట్టారు.