రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య లీడ్ రోల్స్‌లో వాచస్పతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘పిల్ల పిల్ల పిల్ల’ అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌ను ప్రముఖ నిర్మాత సురేష్ బాబు లాంచ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.
అనంతరం హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ ‘ఈ చిత్రాన్ని ఓ చక్కని ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది’ అని చెప్పాడు. తమ చిత్రానికి అద్భుతమైన పాటలు అందించిన ఆర్.ఆర్.ధృవన్‌కి, పాట పాడిన జావేద్ అలీకి దర్శకుడు వాచస్పతి థ్యాంక్స్ చెప్పారు. ఈ చిత్రం ఓపెనింగ్ రామానాయుడు స్టూడియోలో జరిగిందని, ఆ స్టూడియో అధినేత సురేష్ బాబు ఫస్ట్ సింగిల్ లాంచ్ చేయడం ఆనందంగా ఉందని నిర్మాత నరేష్ అన్నారు.
సంగీత దర్శకుడు ఆర్.ఆర్.ధృవన్ మాట్లాడుతూ ‘ఈ బ్యానర్ లో నేను చేస్తున్న రెండో సినిమా ఇది. నేనే పాట రాసి మ్యూజిక్ ఇవ్వడం, నా ఫేవరెట్ సింగర్ జావేద్ అలీ పాడటం ఆనందంగా ఉంది. ఇది ఒక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ మూవీ’ అని చెప్పాడు.
