ఓలమ్మో వగలాడి, నువ్వే నా అమ్మాడి.. సిగ్మా నుంచి లిరికల్ సాంగ్ విడుదల

ఓలమ్మో వగలాడి, నువ్వే నా అమ్మాడి.. సిగ్మా నుంచి లిరికల్ సాంగ్ విడుదల

సందీప్ కిషన్‌‌, ఫరియా అబ్దుల్లా జంటగా తమిళనాడు సీఎం,  హీరో విజయ్ కొడుకు జేసన్‌‌ సంజయ్ తెరకెక్కించిన చిత్రం ‘సిగ్మా’. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఓలమ్మో వగలాడి’ అనే పాటను విడుదల చేశారు.

 తమన్ కంపోజ్‌‌ చేసిన ఈ పాటను యువన్ శంకర్ రాజా, సంజనా దివాకర్ కల్మంజే పాడారు. ‘‘ఓలమ్మో వగలాడి, నువ్వే నా అమ్మాడి, ఓరగా చూశావంటే పోనా అల్లాడి.. ఓలమ్మో వగలాడి, చేయకే ఈ దాడి,  ఒక్కటై పోయామంటే అంతా రాబడి..” అంటూ కృష్ణ చైతన్య సాహిత్యం అందించారు. 

మెలోడీ,  ఎనర్జిటిక్ బీట్‌‌తో సాగిన ఈ పాటలో సందీప్ కిషన్, ఫరియా ఆన్ స్క్రీన్‌‌ కెమిస్ట్రీ ఆకట్టుకుంది.  ఈ చిత్రంలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అన్బు థాసన్, యోగ్ జాపీ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.