సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రం ‘రోమాంచకం’. వేణుగోపాల్ రెడ్డి దర్శకుడు. ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 3న సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
‘‘ఈ లోకం ఎంతో కొత్తగా మారిపోయే ఈ దినం, లోకంలో ఉంది కేవలం నువ్వు నేను ఇద్దరం, గడియారం లేని సమయాలు, కొలమానం లేని సరదాలు, అంతా మనకు సొంతాలు, విసుగంటూ రాని విషయాలు, విషయాలే లేని వివరాలు, ఎంతో ఎంతో మధురాలు, ఇలా ఇలా మొదటిసారి మొదలయ్యిందే, రోమాంచకం.. రోమాంచకం..” అంటూ చంద్రబోస్ రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి.
వాసుకీ వైభవ్ కంపోజ్ చేయడంతో పాటు ఎనర్జిటిక్ గా పాడిన తీరు ఇంప్రెస్ చేసింది. లవర్స్ మధ్య ఉండే క్యూట్ మూమెంట్స్‌తో బ్యూటిఫుల్‌గా చిత్రీకరించారు.
