భారత్ లో మొట్టమొదటి టెస్లా కారు కొన్నది ఇతనే..

భారత్ లో మొట్టమొదటి టెస్లా కారు కొన్నది  ఇతనే..

గ్లోబల్​ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ టెస్లా  భారత్ మార్కెట్లోకి  ప్రవేశించిన సంగతి తెలిసిందే..  ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని టెస్లా ఎక్స్‌పీరియన్స్ సెంటర్' నుంచి మొదటి టెస్లా (మోడల్ Y) కారును ఆ రాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్‌ కొనుగోలు చేశారు. టెస్లా ప్రతినిధులు కారు కీ ని మంత్రికి అందజేశారు. తెలుపు రంగులో ఉండే టెస్లా కారును మంత్రి ప్రతాప్ సర్ నాయక్  కొనుగోలు చేశారు.

కొత్తా కారు కొనుగోలు చేసిన అనంతరం మాట్లాడిన మంత్రి ప్రతాప్..  ఈ టెస్లా కారు కొన్నందుకు సంతోషంగా ఉందన్నారు.  ప్రజల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన పెంచేందుకు తాము ఈ కారును కొనుగోలు చేసినట్లు చెప్పారు.  భారత్ లో  ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుతోందని... ఇది చాలా సానుకూల సంకేతం అని అన్నారు. ఎలక్ట్రిక్  వాహనాలను ఎటువంటి ఇబ్బంది లేకుండా నడపగలిగేందుకు మరిన్ని  ఛార్జింగ్ పాయింట్లను  ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

ముంబైలో తన మొదటి ఎక్స్‌‌పీరియన్స్ సెంటర్‌‌ను మే  15,  2025 న ప్రారంభించింది.  మోడల్ వై ఎలక్ట్రిక్ ఎస్‌‌యూవీని అమ్ముతుంది. దీనిని రూ. 59.89 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్-షోరూమ్) లాంచ్ చేసింది.  అమెరికన్ టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా, షాంఘైలోని తమ తయారీ కేంద్రం నుంచి కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సీబీఐ) గా మోడల్ వై ని మనదేశానికి దిగుమతి చేస్తోంది. 

ప్రపంచంలో ఒకప్పుడు అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచిన మోడల్ వై, భారత్‌‌లో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.  రియర్-వీల్ డ్రైవ్ ధర రూ. 59.89 లక్షల నుంచి మొదలవుతుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 500 కిలోమీటర్లు వెళ్తుంది. లాంగ్-రేంజ్ రియర్-వీల్ డ్రైవ్ వేరియంట్​ప్రారంభ ధర రూ. 67.89 లక్షలు. దీని రేంజ్ 622 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రెండు వేరియంట్ల డెలివరీలు వరుసగా 2025 మూడో, నాలుగో క్వార్టర్​లో మొదలవుతాయి.  తొలుత ఢిల్లీ, ముంబై, గురుగ్రామ్​లలో రిజిస్ట్రేషన్,  డెలివరీలు మొదలవుతాయి.