హేమంత్ ఇప్పలపల్లి కథ రాసుకుని తానే దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ రూపొందించిన చిత్రం ‘ఫస్ట్ టైం’. ఈ సినిమాలో సౌరబ్ ధింగ్ర హీరోగా పరిచయం అవుతుండగా 'బిగ్ బాస్' ఫేమ్ అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్‌గా అనిక్క విక్రమన్ హీరోయిన్‌గా ఇతర ముఖ్య పాత్రల్లో మైమ్ గోపి, శివ, భూపాల్ రాజు, గాయత్రి గుప్త, అన్నపూర్ణమ్మ కనిపించనున్నారు. మే 22న రిలీజ్ కానుంది.
తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధూరి, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఈ సినిమా సక్సెస్ సాధించాలని కోరుతూ టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత హేమంత్ ఇప్పలపల్లి మాట్లాడుతూ ‘డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం.
అన్ని వర్గాలకు నచ్చేలా అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా’ అని అన్నాడు. ఇలాంటి కొత్త తరహా చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని హీరోహీరోయిన్స్ అన్నారు. నటి గాయత్రి గుప్తా, సంగీత దర్శకుడు శ్రీవెంకట్ పాల్గొన్నారు.
