
ఏఐ వాడకం విపరీతంగా పెరిగిపోయింది ఈ మధ్య. నెట్టింట సర్క్యూలేట్ అవుతున్న వీడియోలు, ఫోటోల్లో ఏది ఒరిజినలో, ఏది ఏఐతో చేసినవో గుర్తుపట్టడం కూడా కష్టమయ్యే రేంజ్ లో ఉంటున్నాయి. ఇప్పుడు ఓ చేప ఫోటో చుస్తే.. ఇది ఏఐ ఫోటోనా.. ? నిజమా అన్న డౌట్ రాకమానదు. ఎందుకంటే ఆ చేప మనిషి దంతాలతో పోలి ఉండటమే కారణం. ఎక్కడో కాదు మన బాసరలోనే జరిగింది ఈ వింత. ఆదివారం ( సెప్టెంబర్ 7 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం మన్మద్ గ్రామానికి చెందిన గుండ్ల సంతోష్ అనే వ్యక్తి ఆదివారం బాసర గోదావరి నదిలో చేపలు పట్టడానికి వెళ్ళాడు. నదిలో చేపలు పడుతున్న క్రమంలో సంతోష్ కు మనిషి దంతాలతో పోలిన చేప దొరికింది. ఈ అరుదైన చేపను చూసి ప్రజలు వింతగా ఉందని ఆశ్చర్యపోతున్నారు. చేప బరువు కేజిన్నర ఉందని తెలిపాడు సంతోష్.
చేప ఏ రకం అన్నది తెలీదని.. మిగతా జాలర్లకు కూడా ఇలాంటి చేపలు దొరికాయని తెలిపాడు సంతోష్. మరి, మనిషి దంతాలతో పోలిన ఈ చేప ఏ జాతికి చెందింది.. ఈ చేప పేరు ఏంటి, ఈ రకం చేపలు అరుదైనవా లేక ప్రపంచంలో ఎక్కడైనా ఈ రకం చేపలు ఉన్నాయా అన్నది తెలియాలి.