ఢిల్లీ క్రికెట్‌ లో ఢిష్యుం ఢిష్యుం..AGMలో కొట్టుకున్న ఆఫీస్ బేరర్లు

ఢిల్లీ క్రికెట్‌ లో ఢిష్యుం ఢిష్యుం..AGMలో కొట్టుకున్న ఆఫీస్ బేరర్లు

ఢిల్లీ క్రికెట్‌ అసోసి యేషన్‌(డీడీసీఏ)లో విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి .ఆదివారం జరిగిన యాన్యువల్‌‌ జనరల్‌‌ మీటింగ్‌ (ఏజీఎమ్‌ ) రచ్చ రచ్చగామారింది. ఆఫీస్‌‌ బేరర్లు ఒకరినొకరు కొట్టుకున్నారు . రూలింగ్‌ గ్రూప్‌ జాయింట్ సెక్రటరీ రాజన్‌ మన్‌ చందాపై అపోజిషన్‌ మెంబర్‌ మక్‌ సూద్‌ అలమ్‌ చెయ్యి చేసుకున్నాడు. ఈ వీడియో బయటికి రావడంతో డీడీసీఏపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇండియా మా జీ క్రికెటర్‌ , ఎంపీ గంభీర్‌ దీనిపై తీవ్రంగా స్పందించాడు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశాడు. ‘డీడీసీఏ ఆలౌటైంది.చాలా దారుణంగా డకౌటైంది. ఎలాంటి వారి చేతుల్లో ఇన్‌ స్టిట్యూషన్‌ ఉందో మీరే చూడండి. డీడీ సీఏను వెం టనే రద్దు చేయాలని బీసీసీఐ ప్రెసిడెం ట్‌ గంగూలీ,సెక్రటరీ జై షాని కోరుతున్నా. ఈ గొడవలోపాల్గొన్న వారిపై కఠిన చర్యలు అవసరం. వారిపై లైఫ్‌ బ్ యాన్‌ కూడా విధించాలి’ అని గంభీర్‌ ట్వీట్‌ చేశాడు.