అమర్​నాథ్- యాత్రికులకు ‘గాంధీ’లో ఫిట్​నెస్ టెస్టులు

అమర్​నాథ్- యాత్రికులకు ‘గాంధీ’లో ఫిట్​నెస్ టెస్టులు

పద్మారావునగర్, వెలుగు : అమర్​నాథ్​యాత్రకు వెళ్లేవారికి గాంధీ హాస్పిటల్​లో ఫిట్​నెస్​సర్టిఫికెట్లు ఇస్తున్నట్లు సూపరింటెండెంట్ ప్రొ.రాజారావు తెలిపారు. సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను శనివారం ఆయన ప్రారంభించారు. హాస్పిటల్​మెయిన్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ మెడికల్​ రికార్డు(ఎంఆర్డీ) విభాగంలో ప్రభుత్వం నియమించిన మెడికల్​బోర్డు డాక్టర్లు ప్రతి బుధ, శని వారాల్లో మెడికల్​టెస్టులు చేసి, ఫిట్ నెస్ సర్టిఫికెట్లు ఇస్తారని చెప్పారు.

ఆధార్​కార్డు, రెండు పాస్​ పోర్టు సైజ్​ఫొటోలతో నేరుగా ఎంఆర్డీ డిపార్ట్​మెంట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.రిపోర్టుల ఆధారంగా ఫిట్ నెస్​సర్టిఫికెట్​ఇస్తారని చెప్పారు. 50 ఏండ్లకు పైబడిన వారు రెండు మోకాళ్ల ఎక్స్ రేను అదనంగా సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.