
సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరులో ఐదుగురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారంతా బంగ్లాదేశ్ నుండి అక్రమంగా మన దేశంలోకి ప్రవేశించి నగరంలోని అల్ కబీర్ పరిశ్రమలో నివాసముంటున్నట్టుగా పోలీసులు తెలిపారు. నకిలీ ఐడీ, ఆధార్ కార్డ్ లతో ఇక్కడి అమ్మాయిలను పెళ్లిచేసుకొని శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోడానికి ప్రయత్నిస్తున్నట్టుగా గుర్తించారు.
అక్రమంగా ప్రవేశించిన వారు ఎండీ. బాబు (22), ఎండీ. రిపోన్ (25), గులాం హుస్సేన్(40), సైఫుల్ ఇస్లాం(24) ,ఎండీ. సైదులు ఖురేశ్(29)లు గా పోలీసులు తెలిపారు. అల్ కబీర్ ఎక్సపోర్ట్స్ లిమిటెడ్ పరిశ్రమలో పనిచేసే సలీం, ఇస్లాం అనే బంగ్లాదేశీయులు ఈ ఐదుగురిని ఉపాధి నిమిత్తం ఇక్కడకు తీసుకొచ్చినట్టుగా తెలిపారు. వారంతా ఇక్కడి ప్రాంతంలోని అమ్మాయిలని పెళ్లి చేసుకొని వుంటున్నారనే సమాచారంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తర లించామని పఠాన్ చేరు CI నరేష్ మీడియా సమావేశంలో తెలిపారు.