
ఎల్బీనగర్, వెలుగు: మలక్ పేట మెట్రో స్టేషన్ కింద పార్క్చేసిన ఐదు బైకులు కాలిపోయాయి. శుక్రవారం సాయంత్రం మెట్రో స్టేషన్కింద నిలిపిన ఓ బైక్ నుంచి మంటలు చెలరేగి పక్క బైకులకు అంటుకున్నాయి. క్షణాల్లో ఐదు బైకులు దగ్ధమయ్యాయి. కాలిపోతున్న బైకులను చూసి ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. మెట్రో సిబ్బంది సమాచారంతో మూడు ఫైరింజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి.