
జన్నారం, కాగజ్‌నగర్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకే రోజు ఐదుగురు ఫారెస్ట్ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు. ఇటీవల కలప తరలింపులో వీరి హస్తం ఉన్నట్లు తేలడంతో ఉన్నతాధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఈ నెల 3న జన్నారం ఫారెస్ట్ రేంజ్‌పరిధిలోని చింతగూడ బీట్‌లో నిల్వ ఉంచిన రూ.46 వేల విలువైన కలపను ఫారెస్ట్ ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్నారు. కలప స్మగ్లర్లకు ఎవరు సహకరిస్తున్నారనే దానిపై జిల్లా ఫ్లయింగ్స్క్వాడ్ఆఫీసర్లు విచారణ జరిపారు. జన్నారం టైగర్‌జోన్ పరిధిలోని ఆసిఫాబాద్డివిజన్గిన్నెదరి రేంజ్‌లోని దొంగపెల్లి 2 సెక్షన్ఆఫీసర్వినయ్ కుమార్, మల్యాల 2 సెక్షన్‌ఆఫీసర్ రవికుమార్‌తో పాటు సింగరాయిపేట, చింతగూడ బీట్‌ఆఫీసర్లు లక్ష్మన్, మక్బూల్డ్యూటీలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారని తేలింది. ఎఫ్డీపీటీ వినోద్‌కుమార్ ఆదేశానుసారం నలుగురిని సస్పెండ్ చేసినట్లు జన్నారం ఎఫ్ డీఓ మాధవరావు తెలిపారు. బెజ్జూరు మండల కేంద్రంలో ఓ ఇంట్లో కలప నిల్వ చేసిన ఘటనలో బాధ్యుడైన సలుగుపాల్లి సెక్షన్ ఆఫీసర్ పోశెట్టిని సస్పెండ్ చేశారు.