కల్లాకురిచి: తమిళనాడులోని కల్లాకురిచి జిల్లా శంకరాపురంలో పటాకుల హోల్‌సేల్ దుకాణంలో ఘోర ప్రమాదం జరిగింది. దుకాణంలో నిల్వ చేసిన పటాకులకు మంగళవారం రాత్రి నిప్పంటుకుని భారీ పేలుడు సంభవించింది. దీంతో ఫర్నిచర్‌కు నిప్పంటుకుని మంటలు ఎగిసిపడ్డాయి. పక్కనే ఉన్న బేకరీ షాపులోని గ్యాస్ సిలిండర్ కూడా పేలిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ప్రమాదంలో షాప్ ఓనర్‌తో పాటు ఐదుగురు వర్కర్లు సజీవ దహనమయ్యారు. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
