
పాడుబడిన బావిలో పడిన పిల్లిని రక్షించడానికి ఓ కుటుంబంలలోని ఐదుగురు బావిలోకి దూకి మరణించారు. ఈ విషాదకరమైన ఘటన మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో చోటుచేసుకుంది. ముందు బావిలో పడిన పిల్లిని రక్షించడానికి ఒక వ్యక్తి బావిలో దూకగా.. ఆ తరువాత ఒకరు తరువాత మరోకరు బావిలోకి దూకారు. మొత్తం ఆరుగురు బావిలో దూకగా... చివరగా తాడు కట్టుకుని దూకిన వ్యక్తిని కాపాడినట్లుగా పోలీసులు తెలిపారు.
అతనిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. అయితే ఆ బావిని బయో గ్యాస్ కు ఉపయోగిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఊపిరాడకనే వీరంతా చనిపోయినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఐదుగురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ స్వాధీనం చేసుకుంది.
#WATCH | Five people died in a bid to save a cat who fell into an abandoned well (used as a biogas pit) in Wadki village of Ahmednagar, Maharashtra, late at night.
— ANI (@ANI) April 10, 2024
According to Dhananjay Jadhav, Senior Police Officer of Nevasa Police station, Ahmednagar, "A rescue team… pic.twitter.com/fb4tNY7yzD
మృతులను మాణిక్ కాలే (65), మాణిక్ కుమారుడు సందీప్ (36), అనిల్ కాలే (53), అనిల్ కుమారుడు బబ్లూ (28), బాబాసాహెబ్ గైక్వాడ్ (36)గా గుర్తించారు. బయటకు తీసిన వ్యక్తిని మాణిక్ చిన్న కుమారుడు విజయ్ (35)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.