యూరప్ లో ప్యారట్ ఫీవర్.. ఐదుగురు మృతి

యూరప్ లో ప్యారట్ ఫీవర్.. ఐదుగురు మృతి

న్యూయార్క్: పక్షుల ద్వారా మనుషులకు వచ్చే ప్యారట్ ఫీవర్ తో యూరప్​లో ఐదుగురు చనిపోయారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్​వో) గురువారం తెలిపింది. డెన్మార్క్​లో నలుగురు, నెదర్లాండ్స్​లో ఒకరు ఈ వ్యాధి బారిన పడి మృతి చెందినట్లు పేర్కొంది. ఈ ఐదుగురికి వాళ్ల పెంపుడు పక్షుల కారణంగానే ఈ ఫీవర్ సోకిందని తెలిపింది. ఆస్ట్రియా, జర్మనీ, స్వీడన్​ దేశాల్లో పదుల సంఖ్యలో  కేసులు నమోదయ్యాయని తెలిపింది.  

పెంపుడు, అడవి పక్షులు, ఫౌల్ట్రీ ద్వారా వ్యాప్తి చెందే క్లామిడియా రకం  బ్యాక్టీరియాతోనే ఈ ఫీవర్ మనుషులకు వ్యాపిస్తుంది. దీనిని 2023లో గుర్తించారు. ఈ బ్యాక్టీరియా సోకిన పక్షుల ముక్కు, నోటి నుంచి వచ్చే తుంపరను పీల్చడంతో మనుషులకు ఫీవర్ వస్తుందని తేలింది. బాక్టీరియా బాధిత పక్షుల మలం కలిసిన గాలిని పీల్చినా ప్యారెట్ ఫీవర్ వస్తుందని గుర్తించారు. వ్యాధి సోకిన పక్షుల మాంసాన్ని వండుకుని తినడం ద్వారా మాత్రం ఫీవర్ రాదనితేలింది. ప్యారట్ ఫీవర్ లక్షణాలు సాధారణ వైరల్ ఫీవర్​మాదిరిగానే ఉంటాయని, మనుషులు చనిపోయేంత సీన్ ఉండదని అమెరికా సీడీసీ నిపుణులు చెప్తున్నారు.  ఈ ఫీవర్ వచ్చిన మనుషుల నుంచి ఇతరులకు మాత్రం ఈ వ్యాధి వ్యాపించదని సీడీసీ  తేల్చింది.