చదివింది నాలుగో తరగతి.. రూ. కోట్లలో సైబర్ నేరాలు

చదివింది నాలుగో తరగతి.. రూ. కోట్లలో సైబర్ నేరాలు

olx మోసాలకు పాల్పడుతున్న రాజస్థాన్ కు చెందిన ఐదుగురు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశామని తెలిపారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. వీరు ఇప్పటికే 40 కేసుల్లో నిందితులుగా ఉన్నారని చెప్పారు. రాజస్థాన్ లోని భరత్ పూర్ కేంద్రంగా olx మోసాలకు పాల్పడుతున్నారని..నిందితులను పట్టుకునేందుకు సైబరాబాద్ పోలీసులు నెల రోజుల పాటు రాజస్థాన్ లోనే ఉన్నారని తెలిపారు. ఎంతో కష్టపడి పక్కా సమాచారంతో సైబర్ నేరగాళ్లను పట్టుకున్నారని చెప్పారు.

నిందితులు అంతా నాలుగో తరగతి, పదో తరగతి వరకే చదువుకున్నారని..కోట్ల రూపాయల సైబర్ నేరాలు చేయడంలో ఈ ముఠా ఆరితేరిందన్నారు. olx లో ఆర్మి అధికారిగా id కార్డులు ఆన్లైన్ లో పెడుతున్నారని.. ప్రొడక్ట్ డెలివరీ అయ్యే వరకు డబ్బులు చెల్లించొద్దని తెలిపిన సీపీ..olx లో ప్రొడక్ట్స్ చూసి మోసపోవద్దన్నారు. ఎంతో కష్టపడి సైబర్ నేరగాళ్లను పట్టుకున్న సైబరాబాద్ పోలీసులను అభినందించారు సీపీ సజ్జనార్.