పంజాగుట్టలో డ్రగ్స్ కలకలం..ఐదుగురు కాలేజీ స్టూడెంట్స్ అరెస్ట్

పంజాగుట్టలో డ్రగ్స్ కలకలం..ఐదుగురు  కాలేజీ  స్టూడెంట్స్  అరెస్ట్

డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసులు చర్యలు చేపడుతున్నప్పటికీ తరచూ ఎక్కడో ఒకచోట డ్రగ్స్ కలకలం రేపుతూనే ఉన్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ కట్టడి చేస్తున్నప్పటికీ హైదరాబాద్ లో డ్రగ్స్ దందాకు శుభం కార్డు పడటం లేదు. లేటెస్ట్ గా జనవరి 25న  హైదరాబాద్ నడిబొడ్డులో  డ్రగ్స్ కలకలం రేపుతోంది. 

పంజాగుట్టలోని ఓ కాలేజీలో  డ్రగ్స్ కలకలం సృష్టించింది.  ఐదుగురు విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డారు. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ దగ్గర ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు  పోలీసులు.  వారి దగ్గరి నుంచి  10 గ్రాముల ఎండిఎంఏను  స్వాధీనం  చేసుకున్నారు. ఐదుగురు విద్యార్థులు ఒకే కాలేజీకి చెందిన వారీగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 విద్యార్థుల దగ్గరకు డ్రగ్స్ ఎలా వచ్చింది. ఎవరు సప్లై చేస్తున్నారు. విద్యార్థుల వెనుక ఉన్న ఉన్న డ్రగ్స్ ఫెడ్లర్లు ఎవరనేదానిపై ఆరాదీస్తున్నారు.