జాబ్ నోటిఫికేషన్లు రాక ఈ ఏడాది ఐదుగురు సూసైడ్

జాబ్ నోటిఫికేషన్లు రాక ఈ ఏడాది ఐదుగురు సూసైడ్
  • జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోటిఫికేషన్లు లేక మనస్తాపంతో ఈ ఏడాది ఐదుగురు సూసైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వెలుగు, నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్: రాష్ట్రం వస్తే కొలువులు వస్తాయనుకున్న యువకుల ఆశలతో సర్కారు ఆటలాడుతోంది. జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి చూసి మనస్తాపంతో నిరుద్యోగులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఐదుగురు సూసైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అనంతరావుపల్లెకు చెందిన ఉప్పు రాజు (28) ఫిబ్రవరి 28న ఉరేసుకుని చనిపోయాడు. ఎంఎ, బీఈడీ పూర్తి చేసిన రాజు.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రైవేటు ఆస్పత్రిలో చిన్న జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ పోటీ పరీక్షలకు రెడీ అయ్యేవాడు. కరోనాతో ఉన్న జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోవడం.. సర్కారు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాకపోవడంతో ఆయన సూసైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజావత్ రాంసింగ్ తండాకు చెందిన బోడా సునీల్ నాయక్ (28) మార్చి 26న పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. చికిత్స పొందుతూ ఏప్రిల్ 2న చనిపోయాడు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్తికి చెందిన కాల్వ శ్రీనాథ్(25) బీటెక్ పూర్తి చేసి జాబ్ కోసం ఎదురుచూస్తున్నాడు. నోటిఫికేషన్లు ఎంతకూ రాకపోవడంతో ఏప్రిల్ 29న ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. మెదక్ జిల్లా వెల్దుర్తి పరిధిలోని సెరిల్లాకు చెందిన కొట్టముల వెంకటేశ్ (23) ఏపీలో డీఎస్సీ కోచింగ్ తీసుకున్నాడు. టీచర్ పోస్టుల భర్తీ చేయకపోవడంతో మే 16న ఉరేసుకుని చనిపోయాడు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం మేడారానికి చెందిన నీలకంఠ సాయి నల్గొండలో రూమ్ తీసుకుని గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రిపేర్ అవుతున్నాడు. నోటిఫికేషన్లు రావడం లేదని జూన్ 11న ఆత్మహత్యాయత్నం చేశాడు. తాజాగా కొండల్ ఆత్మహత్య చేసుకున్నాడు.