V6 News

అంకుర హాస్పిటల్లో చిన్నారి మృతి.. వైద్యం వికటించే అని పేరెంట్స్ ఆరోపణ

అంకుర హాస్పిటల్లో చిన్నారి మృతి.. వైద్యం వికటించే అని పేరెంట్స్ ఆరోపణ

కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లిలోని అంకుర హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఐదేండ్ల బాలిక మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణం పోయిందంటూ తల్లిదండ్రులు ఆసుపత్రి ముందు ఆందోళకు దిగారు. వారి వివరాల ప్రకారం.. కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లికి చెందిన ఐదేండ్ల వర్షిణి ఫిట్స్​తో బాధపడుతుండటంతో వారం కింద తల్లిదండ్రులు అంకుర ఆసుపత్రిలో చేర్పించారు. వారం రోజులుగా చికిత్స అందిస్తున్నామని చెబుతూ సుమారు రూ. 4 లక్షల వరకు ఫీజులు వసూలు చేశారు. 

సోమవారం ఒక్కసారిగా వచ్చి పాప ‘బ్రెయిన్ డెడ్’ అయిందని చెప్పడంతో తల్లిదండ్రులు షాక్​కు గురయ్యారు. దీంతో వైద్యం వికటించడం వల్లే తమ కూతురు చనిపోయిందని ఆరోపిస్తూ బాధితులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. అయితే, ఈ ఘటనపై తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి పోలీసులు తెలిపారు.