
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లా ధరాలి గ్రామంలో మంగళవారం కొండచరియలు విరిగిపడటంతో వరదలు ఒక్కసారిగా ముంచుకొచ్చాయి, దీంతో గ్రామంలోని సగానికి పైగా ఇళ్లులు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ భయంకరమైన వీడియోలో వరద నీటి అలలు బలంగా ఇళ్లను ఒక్కసారిగా ముంచెత్తుతుండటంతో ప్రజలు కేకలు వేస్తుండటం చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.
A #cloudburst triggers a massive flood in the Khir Ganga river in #Uttarkashi.
— The Environment (@theEcoglobal) August 5, 2025
Many feared trapped. Disaster teams rushed.#cloudburst #Uttarakhand #landslight@moefcc @ukcmo pic.twitter.com/ex1NkR2OWr
ఈ వరదల వల్ల భారీగా ఆస్తి నష్టం జరగ్గ, శిథిలాల కింద ప్రజలు చిక్కుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకోగ, ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా రెస్క్యూ ఆపరేషన్ కోసం భారత సైన్యాన్ని రంగంలోకి దింపింది.
ALSO READ : 20 ఏళ్ల కుర్రోడు.. రాత్రికి రాత్రి అంబానీ కంటే రిచ్ అయ్యాడు : మన ఇండియాలోనే..!
ఖిర్ గంగా నదిలో నీటి మట్టాలు పెరగడం వల్ల ధరాలిలో వరదలు పొంగాయని సమాచారం. హర్సిల్ నుండి ఆర్మీ యూనిట్లు, పోలీసులు, SDRF బృందాలను భట్వారీకి పంపించినట్లు అధికారులు తెలిపారు. ఈ దారుణ ఘటనపై రాష్ట్ర మంత్రి సౌరభ్ బహుగుణ విచారం వ్యక్తం చేస్తూ శిథిలాలలో చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వ ప్రాధాన్యత అని అన్నారు.