గండిపేట్, వెలుగు: ఎన్నికల కోడ్ శనివారం సాయంత్రం నుంచి అమలులోకి రావడంతో గండిపేట్ మండల పరిధిలోని నార్సింగి, మణికొండ మున్సిపాలిటీ, బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లను అధికారులు, సిబ్బంది తొలగిస్తున్నారు. కోడ్ అమల్లోకి రావడంతో ఎలాంటి రాజకీయ ప్రచార బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని ఎన్నికల అధికారులు సూచించారు. ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
