ఏం విమానం రా బాబూ... అంటూ దిగిపోయిన ప్రయాణికులు.. ఎందుకంటే

 ఏం విమానం రా బాబూ... అంటూ దిగిపోయిన ప్రయాణికులు.. ఎందుకంటే

రైల్వే స్టేషన్లలో.. బస్​ స్టేషన్లలో... ఎయిర్​ పోర్టుల్లో.. వింత వింత అనుభవాలు ఎదురవుతాయి.  సోషల్​ మీడియా యుగంలో అలాంటివి క్షణంలో వైరల్​ అవుతున్నాయి.  ఓ అంతర్జాతీయ విమాశ్రయంలో దారుణమైన పరిస్థితి నెలకుంది.  ఇక అంతే ప్రయాణికులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు.  వివరాల్లోకి వెళ్తే... 

సాధారణంగా విమానమైనా.. రైలు అయినా.. బస్సు అయినా...  ప్రయాణికులను ఎక్కించుకునేముందు దాని కండీషన్​ .. పరిశుభ్రత అంతా చెక్​ చేసిన తరువాతనే  ప్లాట్‌ఫాం మీదకో.. లేదంటే రన్‌వే పైకి  తీసుకొస్తారు. వస్తుంటాయి. కాని అమెరికాలోని ఓ అంతర్జాతీయ ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది.   హాయిగా ప్లైట్​ ఎక్కి గమ్యం చేరుకోవాలనుకున్న  ప్రయాణికులు చుక్కలు కనిపించాయి.  విమానం ఎక్కడంతోనే  వెంటనే అత్యవసర మార్గం ద్వారా బయటకు రావాల్సిన పరిస్థితి దాపురించింది.  విమానంలో దుర్గంధం ( Bad Smell) రావడంతో కనీసం రెండు నిమిషాలు ఉండలేకపోయారు.  ఇక ఎక్కిన వారందరు  ఎమర్జెన్సీ ద్వారాల నుంచి జారుకుంటూ వచ్చేశారు.ఈ దారుణ పరిస్థితి షార్లెట్ డగ్లస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.

గంటల తరపడి ప్రయాణం చేయాల్సిన విమానంలో టేకాఫ్​ కు ముందే ప్రయాణికులు కిందకు దిగారు.  అమెరికాలో జరిగిన ఈ ఘటన సోషల్​ మీడియాలో వైరల్​ అవుతుంది.  అత్యవసరమార్గంలో దిగే సమయంలో కొంతమంది ప్రయాణికులకు గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  ఈ ఘటనపై ప్రయాణికులకు క్షమాపణ చెప్పిన విమానయాన సంస్థ... దర్యాప్తు జరిపిన తరువాత కారకులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. 

ఓర్లాండోలో ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 1759..  షార్లెట్ డగ్లస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. విమానంలో 226 మంది ప్రయాణికులు ఉన్నారు. టేకాఫ్‌కు సిద్ధపడుతుండగా తీవ్రమైన దుర్వాసన రావడం ప్రారంభమైంది. దీంతో వాసన భరించలేక ఎమర్జెన్సీ డోర్‌ల నుంచి కిందకు దిగేశారు. సంఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది

టేకాఫ్‌కు ముందే దుర్వాసన రావడంతో ప్రయాణికులు కిందికి దిగేశారు. బుధవారం సాయంత్రం అమెరికాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కిందకి దిగే క్రమంలో పలువురు ప్రయాణికులు కూడా గాయపడినట్లుగా తెలుస్తోంది. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సంఘటనపై విమాన సంస్థ.. ప్రయాణికులకు క్షమాపణ చెప్పింది. ఈ ఘటనకు కారకులపై దర్యాప్తు తర్వాత యాక్షన్ తీసుకుంటామని వెల్లడించి...అనంతరం ప్రత్యామ్నాయ విమానంలో ప్రయాణికులను పంపించారు.