దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ.. స్కూళ్ల మూసివేత..

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ.. స్కూళ్ల మూసివేత..

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో  భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.  ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రకటించాయి. మరికొన్ని రోజులు భారీ వర్షాలు నేపథ్యంలో వాతావరణ ఆయా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. 
కర్ణాటకలో భారీ వర్షాల కారణంగా కొల్హాపూర్ లో పాఠశాలలు మూసివేశారు. కోస్తా కర్ణాటక, ఉత్తర కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు వాతావరణ శాఖ హెచ్చరికలతో సిద్దరామయ్య ప్రభుత్వం వరద ప్రభావ ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించింది.  మరోవైపు మహారాష్ట్రకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావారణ శాఖ. దీంతో రాయ్ఘఢ్,  అలీబాగ్ జిల్లాల్లోని పలు ఇన్ స్టిట్యూట్, విద్యాసంస్థలు మూసివేశారు.  ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాల పరిస్థితి: 
అయితే దేశ రాజధాని ఢిల్లీ, నోయిడా తోపాటు ఈశాన్య రాష్ట్రాలు బుధవారం భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి.  ఢిల్లీ, నోయిడా , దేశ రాజధానిలోని ఇతర ప్రాంతాలు బుధవారం వర్షం దంచి కొట్టడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కాలనీల్లో వరద ప్రవాహం నిలిచిపోయింది. వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జనజీవనం స్తంభించింది. హిండన్ నది నీటి మట్టాలు పెరగడంతో ఎకో-టెక్ ప్రాంతం వరదలకు గురై వందలాది వాహనాలు నీటిలో మునిగిపోయాయి. మరో మూడు రోజుల పాటు ఢిల్లీ , దాని పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వర్షాల కారణంగా సిమ్లా జిల్లాలోని బ్రోని నల్లా, జియోరి ప్రాంతాల్లో జాతీయ రహదారిని బ్లాక్ చేశారు అధికారులు. 

 

#WATCH | Himachal Pradesh | National Highway blocked at two locations in Broni Nalla and Jeori in Shimla district following rainfall.

(Videos source: NHAI - National Highways Authority of India) pic.twitter.com/g9cY80Q4fx

— ANI (@ANI) July 26, 2023