వీడియో: అచ్చంపేట మెయిన్ రోడ్డుపై వరద.. నీటిలో కొట్టుకుపోయిన బీరువా

వీడియో: అచ్చంపేట మెయిన్ రోడ్డుపై వరద.. నీటిలో కొట్టుకుపోయిన బీరువా

మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎన్నడూనంతగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. అచ్చంపేట.. గద్వాల పట్టణాల్లోని మెయిన్ రోడ్లపై నడుము లోతు నీళ్లు ప్రవహిస్తుంటే.. జనం ఆశ్చర్యంగా చూస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇంతటి వర్షాలు చూడలేదని.. వరదలను మరిపిస్తున్నాయంటున్నారు. అచ్చంపేటలోని మెయిన్ రోడ్డుపై నడుము లోతు నీళ్లు ప్రవహిస్తుండగా.. ఓ ఇంటి నుండి బీరువా కొట్టుకుని వచ్చింది. రోడ్డుపై వాగును తలపిస్తున్న నీటి ప్రవాహాన్నిపక్కన నిలబడి జనం చూస్తుంటే ఓ బీరువా కొట్టుకుని పోతూ కనిపించింది. కొద్ది వారగా బైకును ఆసరాగా చేసుకుని ఓ యువకుడు బీరువాను లాగే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న మిగతా వాళ్లు ఆ బీరువా నీళ్లలో కొట్టుకుపోకుండా పట్టుకున్నారు.