ప్ర‌భుత్వ సాయం అంద‌‌లేదంటూ హెచ్ఆర్సీ ని ఆశ్ర‌యించిన వ‌ర‌ద బాధితులు

ప్ర‌భుత్వ సాయం అంద‌‌లేదంటూ హెచ్ఆర్సీ ని ఆశ్ర‌యించిన వ‌ర‌ద బాధితులు

హైదరాబాద్ : ప్రభుత్వం ప్రకటించిన సహాయం అందించకుండా అధికారులు నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నారంటూ వ‌ర‌ద బాధితులు సోమవారం ఎంబీటీ ( మజ్లీస్ బచావో తేరీక్ ) పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. ఇటీవల కురిసిన భారీ వ‌ర్షాల‌ వల్ల మహేశ్వరం నియోజకవర్గం జల్ పల్లి మున్సిపాలిటీ లోని ఉస్మాన్ నగర్ , అహ్మద్ నగర్ , సైఫ్ కాలనీ లలో ఇప్పటికీ కూడా నీరు నిలిచే ఉందని… దాని వల్ల వెయ్యి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని బాధితులు పిటిషన్ లో తెలిపారు. తమ బస్తీలలో నిలిచిన వర్షం నీటిని తొలగించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న రెవెన్యూ , మున్సిపల్ , ఇరిగేషన్ శాఖ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు కమిషన్ ను కోరారు.