హిమాయత్ సాగర్ కు పెరుగుతున్న వరద.. మళ్లీ నాలుగు గేట్లు ఎత్తివేత..

హిమాయత్ సాగర్ కు పెరుగుతున్న వరద.. మళ్లీ నాలుగు గేట్లు ఎత్తివేత..
  • మూడు ఫీట్లు ఎత్తిన అధికారులు

హైదరాబాద్​సిటీ, వెలుగు: జంట జలాశయాలకు వరద ప్రవాహం పెరుగుతోంది. రెండు రోజుల క్రితం వరద ప్రవాహం తగ్గినట్టు కనిపించినా మళ్లీ పెరుగుతోంది. తాజాగా క్యాచ్‌మెంట్​లో వర్షాల కారణంగా హిమాయత్ సాగర్ రిజర్వాయర్‌కు ప్రవాహం మరింత పెరుగుతోంది. గత రెండు రోజుల క్రితం నాలుగు గేట్లను ఒక అడుగు మేరకు ఎత్తి మూసీలోకి నీటిని వదిలిన అధికారులు తర్వాత మూడు గేట్లను మూసేశారు. 

తాజాగా మళ్లీ వరద పెరుగుతుండడంతో సోమవారం రాత్రి 8 గంటలకు నాలుగు గేట్లను మూడు అడుగుల మేరకు ఎత్తి నీటిని వదులుతున్నారు. 3,960 వేల క్యూసెక్కుల నీటిని ముసీ నదిలోకి విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. హిమాయత్​సాగర్​ ఫుల్​ ట్యాంక్​ లెవల్​ 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1762.45 అడుగుల మేరకు ఉంది. 

జలాశయంలోకి ఇన్​ఫ్లో 3 వేల క్యూసెక్కులు కాగా, ఔట్​ ఫ్లో 3,960 క్యూసెక్కులుగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. అలాగే ఉస్మాన్​సాగర్ ​ఫుల్​ట్యాంక్​లెవెల్​1790 అడుగులు కాగా, ప్రస్తుతం 1783.85 అడుగులకు చేరింది. ఇన్​ఫ్లో 600 క్యూసెక్కులు ఉందని అధికారులు తెలిపారు.