తెలంగాణ ఈ సిటీలో సీఎం రేవంత్ ఫ్లూయిడ్స్ యూనిట్ ను ప్రారంభించారు. ఫ్యూర్, కేర్, రేర్ గా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తామని ఆయన తెలిపారు. విజన్ డాక్యుమెంట్ తో తెలంగాణ దూసుకెళ్తుంది, గ్లోబల్ సమ్మిట్ ను ఏర్పాటు చేసి విజన్ డాక్యుమెంట్‌తో ముందుకెళ్తుందన్నారు.
ప్రంపంచ దేశాలతో హైదరాబాద్ పోటీపడుతుందన్నారు. ఇందులో 30 ఏళ్ల శ్రమ ఉందన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే వారికి తెలంగాణ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందన్నారు. ఫార్మారంగంలో ప్రపంచ దేశాలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయన్నారు. పాలసీ పెరాల్సిస్ లేకుండా విధానాలను రూపొందిస్తున్నామన్నారు.
