ఇన్నోవేటివ్​ ఫైనాన్సింగ్​ మోడల్స్​పై ఫోకస్​ పెట్టండి

ఇన్నోవేటివ్​ ఫైనాన్సింగ్​ మోడల్స్​పై ఫోకస్​ పెట్టండి
  • ఆర్థిక సంస్థలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పిలుపు

న్యూఢిల్లీ:ఎకానమీలో కొత్తగా వచ్చే ఐడియాలకు డబ్బు ఇచ్చేలా ఇన్నోవేటివ్​ ఫైనాన్సింగ్​ మోడల్స్​పై ఫోకస్​ పెట్టమని ఆర్థిక సంస్థలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సూచించారు. ఈ టైములో గ్రీన్​ ఫైనాన్సింగ్​ చాలా అవసరమని, 2070 నాటికి జీరో కార్బన్​ ఎమిషన్స్​ టార్గెట్​ను అందుకోవాలని చెప్పారు. ఎన్విరాన్​మెంట్​ ఫ్రెండ్లీ ప్రాజెక్టులకు భారీగా అప్పులు ఇవ్వాలని పేర్కొన్నారు. బడ్జెట్​పై జరిగిన ఒక వెబినార్​లో మోడి పాల్గొన్నారు. ఎంఎస్​ఎంఈ రంగాన్ని పటిష్టం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు సక్సెస్​ కావాలంటే, వాటికి ఫైనాన్సింగ్​ చాలా ముఖ్యమని మోడి చెప్పారు.

ఫిన్​టెక్​, అగ్రిటెక్​,మెడిటెక్​, స్కిల్​ డెవలప్​మెంట్​ రంగాలలో ముందడుగు వేస్తే తప్ప, ఇండస్ట్రీ 4.0 సాధ్యం కాదని పేర్కొన్నారు. ఈ రంగాలకు ఫైనాన్షియల్​ ఇన్​స్టిట్యూషన్స్​ సాయమందిస్తేనే దేశం ముందుకు దూసుకెళ్తుందని అన్నారు. కన్​స్ట్రక్షన్​, స్టార్టప్స్​, డ్రోన్స్​, స్పేస్​, జియో స్పేషియల్​ డేటా వంటి  8–10 రంగాలను ఎంపిక చేసి, వాటికి  అప్పులు ఇవ్వాలని చెప్పారు. ఆ రంగాలలో గ్లోబల్​టాప్​ 3 పొజిషన్​కి ఎదిగేలా ప్రయత్నం జరగాలని సూచించారు. మెడికల్​ ఎడ్యుకేషన్​లో సవాళ్లున్నాయని, మరిన్ని మెడికల్​ ఇన్​స్టిట్యూషన్స్​ రావాలని చెప్పారు. ఈ రంగానికీ  ఆర్థిక సంస్థలు అప్పులు ఇవ్వాలని అన్నారు.