
నార్త్ సౌండ్ (అంటిగ్వా): లీగ్ దశలో వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచిన సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్‌లో అసలు పోరుకు రెడీ అయ్యింది. సూపర్–8లో భాగంగా బుధవారం జరిగే గ్రూప్–2 తొలి మ్యాచ్‌లో సంచలనాల జట్టు అమెరికాతో తలపడనుంది. ఇప్పటి వరకు బౌలర్ల సూపర్ పెర్ఫామెన్స్‌తో గెలిచిన ప్రొటీస్ ఇప్పుడు బ్యాటింగ్‌పై ఫోకస్ చేస్తోంది. క్లిష్టమైన న్యూయార్క్, కింగ్స్‌టౌన్ పిచ్‌లపై కనీసం 120 రన్స్ చేయలేకపోయిన సఫారీ బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. డికాక్, క్లాసెన్, స్టబ్స్, మిల్లర్‌లాంటి బిగ్ హిట్టర్లు అందుబాటులో ఉన్నా ఏ మ్యాచ్‌లోనూ వీళ్లు బ్యాట్లు ఝుళిపించలేకపోయారు. ఈ పోరులో బ్యాటర్లపైనే ఫోకస్ ఉండనుంది. ఓవరాల్‌గా గ్రూప్–2లోనే ఉన్న ఇంగ్లండ్, వెస్టిండీస్ నుంచి గట్టి పోటీ ఉండనున్న నేపథ్యంలో ఎలాగైనా అమెరికాపై గెలిచి బోణీ చేయాలని సౌతాఫ్రికా భావిస్తోంది. మరోవైపు ఎనిమిది మంది ఇండియన్ సంతతి ప్లేయర్లతో కూడిన అమెరికాను కూడా తక్కువగా అంచనా వేయలేం. అరంగేట్రంలోనే సూపర్–8కు దూసుకొచ్చిన యూఎస్ దూకుడైన ఆటకు బ్రాండ్‌గా మారింది. కెప్టెన్ మోనాంక్ పటేల్ ఫిట్‌నెస్‌లోకి వస్తే బ్యాటింగ్ మరింత బలోపేతమవుతుంది. బౌలర్లు రాణిస్తుండటం కలిసొచ్చే అంశం. లీగ్ దశలో పాకిస్తాన్‌కు షాకిచ్చిన అమెరికా అలాంటి పెర్ఫామెన్స్‌నే రిపీట్ చేయాలని భావిస్తోంది.