న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ తన ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచింది. ఒక్కో ఆర్డర్‌పై ఫీజును 17 శాతం పెంచి రూ.17.58 గా నిర్ణయించింది. కొద్దిరోజుల క్రితం దీని పోటీ కంపెనీ జొమాటో కూడా ఫీజును పెంచింది. ప్రస్తుతం జీఎస్టీతో కలిపి రెండు సంస్థల ఫీజులు దాదాపు సమానంగా ఉన్నాయి. ఆపరేటింగ్ ఖర్చులు, సాంకేతిక నిర్వహణ కోసం ఈ ఫీజును పెంచామని కంపెనీ తెలిపింది. యుద్ధం వల్ల చమురు ధరలు పెరగడంతో డెలివరీ ఖర్చులు కూడా భారంగా మారాయి. స్విగ్గీ గత సెప్టెంబర్‌లోనూ ప్లాట్ఫామ్ఫీజును పెంచింది.
