జగిత్యాల పట్టణం ధరూర్ క్యాంపులోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. గత మూడు రోజులుగా ఫుడ్ సరిగా లేదని.. ఇవాళ బయట నుండి ఫుడ్ తీసుకువచ్చారని విద్యార్థులు చెబుతున్నారు. ఆ ఆహారం తినడంతో ఫుడ్ పాయిజన్ అయిందని విద్యార్థులు తెలిపారు. అస్వస్థతకు గురైన ముగ్గురు విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో పాఠశాలలో గందరగోళం నెలకొంది.
