Food Recipes : రెస్టారెంట్ స్టయిల్ షెజ్వాన్ వెజ్ ఫ్రైడ్ రైస్, నూడుల్స్ ఇంట్లో తయారు చేసుకునే విధానం ఇలా..!

Food Recipes : రెస్టారెంట్ స్టయిల్ షెజ్వాన్ వెజ్ ఫ్రైడ్ రైస్, నూడుల్స్ ఇంట్లో తయారు చేసుకునే విధానం ఇలా..!

షెజ్వాన్ వెజ్ ఫ్రైడ్ రైస్

కావాల్సినవి

  • అన్నం: ఒక కప్పు
  • క్యారెట్ తురుము: పావు కప్పు
  • ఉల్లికాడల తరుగు: రెండు టేబుల్ స్పూన్స్
  • బీన్స్ తరుగు: పావు కప్పు
  • ఎండు మిర్చి: నాలుగు
  • తెల్ల మిరియాల పొడి: ఒక టీ స్పూన్
  • అనాస పువ్వు పొడి: ఒక టీ స్పూన్
  • వెనిగర్: అర టీ స్పూన్
  • షెజ్వాన్ సాస్: పావు కప్పు
  • ఆరోమేటిక్ పౌడర్: ముప్పావు టీ స్పూన్
  • లైట్ సోయా సాస్: అర టీ స్పూన్
  • చక్కెర: చిటికెడు
  • నూనె: పావు కప్పు
  • ఉప్పు: తగినంత

తయారీ: 

  • ఒక కడాయిలో హైఫ్లేమ్ మీద నూనె వేడి చేసి అందులో ఎండుమిర్చి, ఉల్లికాడల తరుగు, క్యారెట్ తరుగు వేసి వేగించాలి.
  • తర్వాత షెజ్వాన్ సాస్ వేసి ఫ్రై చేయాలి.
  • ఆ తర్వాత ఉప్పు, తెల్ల మిరియాల పొడి, ఆరోమేటిక్ పౌడర్, అనాస పువ్వు పొడి వేసి బాగా కలపాలి. తర్వాత పొడిగా వండుకున్న అన్నం వేసి బాగా కలపాలి. అన్నానికి మసాలాలు అన్నీ పట్టిన తర్వాత లైట్గా సోయా సాస్, వెనిగర్ వేసి బాగా కలపాలి. చివరగా చిటికెడు చక్కెర, రెండు టీ స్పూన్స్ ఉల్లికాడల తరుగు వేసి కలిపితే షెజ్వాన్ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇందులో బాస్మతి రైస్ లేదా సోనామసూరి రైస్ ఏదైనా వాడుకోవచ్చు.

షెజ్వాన్ వెజ్ నూడుల్స్

కావాల్సినవి

  • నూడుల్స్: ఒక రోల్
  • ఉల్లిగడ్డ చీలికలు: ఒక కప్పు
  • క్యారెట్ చీలికలు: అర కప్పు
  • క్యాప్సికమ్ చీలికలు: అర కప్పు
  • క్యాబేజి తరుగు: ఒక కప్పు
  • షెజ్వాన్ సాస్: రెండు టేబుల్ స్పూన్స్
  • ఆరోమేటిక్ పౌడర్: ఒక టీ స్పూన్
  • నల్ల మిరియాల పొడి: అర టీ స్పూన్
  • లైట్ సోయా సాస్: ఒక టీ స్పూన్
  • వెనిగర్: ఒక టీస్పూన్
  • చక్కెర: చిటికెడు
  • తెల్ల మిరియాల పొడి: ఒక టీ స్పూన్
  • అనాస పువ్వు పొడి: అర టీ స్పూన్
  • నూనె: రెండు టేబుల్ స్పూన్స్
  • ఉప్పు: తగినంత

తయారీ: 

నూడుల్స్ను 90 శాతం ఉడికించి, నీళ్ల నుంచి బయటకు తీసి, కొంచెం నూనె వేసి ఒకదానికొకటి అంటుకోకుండా చల్లార్చాలి. కూరగాయల్ని (ఉల్లిగడ్డలు, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ) తురుముకోకుండా, పొడవుగా, సన్నని చీలికల్లా కట్ చేసుకోవాలి. ఒక కడాయిలో హై ఫ్లేమ్ మీద నూనె వేడి చేసి ఉల్లిగడ్డ చీలికలు, క్యాప్సికమ్ చీలికలు, క్యారెట్ చీలికలు, క్యాబేజీ చీలికలు వేసి 70 శాతం వరకు వేగించాలి. తర్వాత నూడుల్స్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు షెజ్వాన్ సాస్, ఆరోమేటిక్ పౌడర్, నల్ల మిరియాల పొడి, తెల్ల మిరియాల పొడి, లైట్ సోయా సాస్, వెనిగర్, చక్కెర, ఉప్పు వేసి బాగా కలపాలి. అన్నీ బాగా కలిశాక, అనాస పువ్వు పొడి వేసి మరోసారి కలుపుకుంటే షెజ్వాన్ వెజ్ నూడుల్స్ రెడీ.